Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అజ్ఞాతవాసి' ప‌బ్లిసిటీ కోసం ప‌ర‌మ శివుడి పేరును పవన్ కల్యాణ్ నీచంగా వాడుకుంటున్నారు: న‌్యాయ‌వాది

  • వివాదాన్ని మేము చేయ‌డం లేదు
  • 'కొడకా కోటేశ్వరరావు' అని మా పేరెందుకు పెట్టుకున్నారు
  • కొడ‌కా చిరంజీవి అని, నాగ‌బాబు అని పెట్టుకోండి
  • మా పేరును ఇలా అవ‌హేళన చేస్తోంటే మేము ఆత్మ‌హత్య చేసుకోవాలా? 
సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ 'అజ్ఞాత‌వాసి' సినిమా ప‌బ్లిసిటీ కోసం ప‌ర‌మ శివుడి పేరును నీచంగా వాడుకుంటున్నారని న‌్యాయ‌వాది కోటేశ్వ‌ర‌రావు అన్నారు. ఆ సినిమాలోని 'కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు' పాట‌పై మాచ‌వ‌రం పీఎస్ లో కోటేశ్వ‌ర‌రావు అనే న్యాయ‌వాది ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో కోటేశ్వ‌ర‌రావు మీడియాతో మాట్లాడుతూ.. "ఇక్క‌డ వివాదాన్ని మేము చేయ‌డం లేదు.. కోటేశ్వ‌ర‌రావు పేరును ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వాడుకున్నారు.. నీచంగా, అవ‌హేశ‌న చేస్తూ పాట‌ పాడారు.

కోటేశ్వ‌ర‌రావు పేరు ఉన్న ప్ర‌తి ఒక్క‌రి మ‌నోభావాలు దెబ్బ‌తినేలా చేశారు.. నేను ఎంతో మాన‌సిక క్షోభ‌ను అనుభ‌వించాను.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పంచె క‌ట్టుకుంటే లేక‌ వెరైటీ ఫ్యాంటు వేస్తేనే అంద‌రూ అది ఫాలో అవుతుంటారు. కోటేశ్వ‌ర‌రావు అనే పేరుకి బదులుగా కొడ‌కా చిరంజీవి అని, కొడకా నాగ‌బాబు అని పెట్టుకోండి.. మా పేరును ఇలా అవ‌హేళన చేస్తోంటే మేము ఆత్మ‌హత్య చేసుకోవాలా?" అని ప్ర‌శ్నించారు. 
agnathavasi
Pawan Kalyan
koteshwara rao

More Telugu News